శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం అభివృద్ధికి గాను ఒక లక్ష ఆ పైన విరాళం ఇచ్చిన దాతల పేర్లు శిలాఫలకంపై లిఖించారు. ఆ శిలాఫలకంను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం దాతలను సన్మానించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని వెంకటేశ్వరరావు ,ప్రసాద్, HMT హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ మూర్తి, సెక్రెటరీ గోపీ చంద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.