శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మెహర్ కాలనీ, నేతాజీ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గుల్ మెహర్ కాలనీ, నేతాజీ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలలో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరచాలని, అవసరమున్న చోట UGD పైప్ లైన్లు వేయాలని , వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే గుల్ మెహర్ కాలనీ, నేతాజీ నగర్ కాలనీలో పర్యటిస్తానని, కాలనీలలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రైనేజి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే అవసరమున్న చోట రోడ్లను, UGD పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, అన్ని పనులను దశల వారిగా చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్ మెహర్ కాలనీ ప్రెసిడెంట్ ఖాసీం, కాలనీ వాసులు శారద, మోహన్ చారి, గణేష్, సంతోష్, శ్రీనివాస్ , సంధ్య, శ్రీనివాసులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.