నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ పలు శాఖల అధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ సమీక్ష సమావేశం నిర్వహంచారు. సివరేజ్ వ్యవస్థ (డ్రైనేజి నిర్వహణ ), తాగునీటి సరఫరా నిర్వహణ పనితీరు, వాటి విధి విధానాల పై జోనల్ కమిషనర్ శంకరయ్య , కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి మాట్లాడారు. వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, మంచి నీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన త్రాగు నీరు ప్రజలకు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలకు వెంటనే స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకొవాలని చెప్పారు.
ప్రజల నుండి , వాట్సాప్ గ్రూప్ ల నుండి వచ్చిన వినతుల ద్వారా వచ్చిన డ్రైనేజి పొంగుతున్న వంటి సమస్యల ను 95 శాతం పరిష్కరించామని , మిగతావి త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తామని జలమండలి అధికారులు ప్రభుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకువచ్చరు. వచ్చిన సమస్యల ను ఒక రోజు రెండు, మూడు రోజులలో పూర్తి చేశామని చెప్పారు. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి తమ కార్యాలయం, కార్పొరేటర్ల నెంబర్లను అందులో ఉంచి ప్రజల నుండి వచ్చే వినతులు పరిష్కరించేలా కృషి చేయడం అభినందనియమని ప్రశాంసించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డిజిఎం శరత్ రెడ్డి , మేనేజర్లు యాదయ్య, సందీప్ కుమార్, నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, పూర్ణేశ్వరి, సాయి చరిత పాల్గొన్నారు.