శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం శేరిలింగంపల్లి కమిటీ ఆధ్వర్యంలో చందానగర్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి ఎస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుY. వెంకటేష్, సి.రాజు, కెవిపిఎస్ నాయకులు సత్యము ,శ్రీనివాసు ,సిపిఎం శేర్లింగంపల్లి కార్యదర్శి శోభన్, కాంగ్రెస్ నాయకులు కవిరాజు, సూర్య ,సిఐటియు కార్యదర్శి కృష్ణ, వరుణ్ ,మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.