శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నివాసంలో ఆమె ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్టమస్ వేడుకలలో చందానగర్ డివిజన్ పరిధిలోని పాస్టర్లు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి, పాస్టర్లు ఆంటోనీ , ఏలీయా, డేనియల్, కరుణాకర్, మోసెస్, సునీల్, నటానిల్ తదితరులు పాల్గొన్నారు.