సీఎం స‌హాయ‌నిధి పేద‌ల‌కు గొప్ప వ‌రం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాం గూడ కి చెందిన బజరావు నర్స్ బాయి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.2,50,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ , అనిల్, మహేందర్, చందు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి స‌హాయం అంద‌జేస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here