శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి సంవత్సరం ముస్లిం మాసాల ప్రకారం రబ్బీసాని మాసంలో దర్గా వద్ద గ్యార్మీ పండుగను ఘనంగా జరుపుకుంటారని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గ్యార్మి పండుగ పురస్కరించుకుని అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈద్గా నందు నిర్వహించిన ఉత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి పాల్గొని జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కూన సత్యం గౌడ్, కావూరి ప్రసాద్, వాసు, నవీన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, నవాజ్, కైజర్, సయ్యద్,రెహ్మాన్, సుల్తాన్, అబ్దుల్, కలీల్, అలహాబాక్ష, ముస్తఫా, షఫీ, సోయల్ తదితరులు పాల్గొన్నారు.