శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీ వెంకటేశ్వర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లు పథకం కొరకు అప్లై చేసుకున్న వారిని గుర్తించడం కోసం సిఓ పాప గౌడ్ తో కలిసి కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని దరఖాస్తులను స్వీకరించారని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని, కానీ ఒక్క పథకం కూడా అర్హులకు అమలు కావడం లేదన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంకా పథకం ద్వారా లబ్ధి జరగలేదని, కనుక వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రజలకు అన్ని పథకాలు అమలయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల ఆంజనేయులు, జగదీష్ గౌడ్, రాజశేఖర్, రమేష్ రావు, బాబు, రవీందర్రావు, నాగార్జున, భారతి చౌదరి, తానారాం, కిషన్ తదితరులు పాల్గొన్నారు.