నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శైలజ ప్రసాద్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణపతి కౌతం, నాగేంద్రహారయా, కృష్ణ జనన శబ్దం, రామాయణ శబ్దం, శ్రీమాన్ నారాయణ, జతిస్వరం, కృష్ణం కలయసఖి మొదలైన అంశాలను లాస్య, సిరిమా, స్మ్రితి, గీత, శాన్వి, దీత్య, మొదలైన వారు ప్రదర్శించారు.