శేరిలింగంప‌ల్లిలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నాగ పంచ‌మి

శేరిలింగంప‌ల్లి, జూలై 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నాగ పంచమిని మ‌హిళ‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. చందాన‌గ‌ర్‌లోని గౌత‌మిన‌గర్‌లో ఉన్న వేముకుంట శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో నెల‌కొన్న పుట్ట‌లో మ‌హిళ‌లు పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామికి, నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హించిన పూజ‌ల్లో దేవాల‌య ట్ర‌స్టీ గుర్ర‌పు విజ‌య‌లక్ష్మి, ర‌వీంద‌ర్ రావు దంప‌తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here