ఆరు నెలలలో బిఆర్ ఎస్ గద్దె దిగడం ఖాయం : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • భారతీయ జనతా పార్టీలోకి కొనసాగుతున్న వరసల పర్వం
  • శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి గెలుపు నల్లేరుపై నడకే

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి డివిజన్ బిర్లా ఫంక్షన్ హాల్ లో గోపాలరావు, వేణు, బుల్లెట్ రవి, భార్గవి, విజయ్ రెడ్డి, రేణుక , శ్యామల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి , రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నుండి బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో బిఆర్ఎస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయమని, వారి పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని తెలిపారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నుండి బిజెపిలో చేరిన వారితో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నేటి తెలంగాణ ప్రభుత్వం కబ్జాలపై ఉన్న దృష్టి అభివృద్ధి పైన లేదని ఇచ్చిన హామీలన్నీ గంగలో తొక్కి కొత్త కొత్త స్కీమ్స్ తెచ్చి ప్రజలను ప్రలోభ పెట్టి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుందన్నారు. ప్రజలందరూ దీని గమనించి జాగ్రత్తగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలకు మరింత చేరువవుతున్నదని తెలుపుతూ , పార్టీలో కలిసిన వారికి మా అండదండలు పూర్తి సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ మున్ముందు మరిన్ని చేరికలు ఉంటాయని, కార్యకర్తలంతా ఎల్లప్పుడు ప్రజల్లో ఉంటూ వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటూ పార్టీ పురోగతికి తోడ్పడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, కో కన్వీనర్ మణిభూషణ్, డివిజన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, నరేందర్ రెడ్డి, సూర్యారావు, రామరాజు, శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్ యాదవ్, చారి, సీతారామరాజు, రాజిరెడ్డి, బాలు యాదవ్, శ్రీధర్ పటేల్, శ్రీకాంత్ యాదవ్, శ్రీలత, కృష్ణప్రియ, నరేష్ సాయి, మురళీకృష్ణ , శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here