ఘనంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదినం

  • గజమాల వేసి సన్మానం
  • పెద్ద ఎత్తున హాజరైన బిఆర్ ఎస్ నేతలు, నాయకులు, అభిమానులు
  • పూలబొకెలు అందించి శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదినాన్ని బిఆర్ ఎస్ నేతలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. డిజె సౌండ్స్, బ్యాండ్ మేళాల నడుమ రోడ్లపై నృత్యాలు చేశారు. తమ అభిమాన నాయకుడి బర్త్డే సందర్భంగా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు వేదికపై రాగం నాగేందర్ యాదవ్ ని గజమాలతో సన్మానించారు.

అప్పటికే భారీ ఎత్తున ఏర్పాటుచేసిన బర్త్డే కేక్ ను కార్పొరేటర్ కట్ చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ లకు ఎంపీపీస్ సురభి కాలనీ పాఠశాల విద్యార్థి విద్యార్థినిలు గులాబీ మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక రాగం నాగేందర్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ వార్డు కార్యాలయ ఆవరణలో టీం ఆర్ ఎన్ వై ఆధ్వర్యంలో “మెగా రక్తదాన” శిబిరం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై రక్తదానం చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో జన్మదిన సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని ఆశీస్సులు అందుకున్నారు.


ప్రభుత్వ విప్ గాంధీ , తదితర డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, పుర ప్రముఖులు, శేరిలింగంపల్లి నియజకవర్గం, రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసి కార్పొరేటర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న విందులో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన ప్రతి ఒక్కరూ భోజనం చేసారు. తన జన్మదినం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులు మాట్లాడుతూ “ప్రతి ఒక్కరం రక్తదానం చేద్దాం ఆపదలో ఉన్నవారికి అండగా నిలుద్దాం” ఇదే మన ప్రజానాయకుడికి మనం అందించే అపూర్వ కానుక అని అన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here