నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, హుడా కాలనీలో వర్షం పడినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బీజేపీ శ్రేణులు , స్థానిక కాలనీవాసులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాపిరెడ్డి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు మాట్లాడుతూ వర్షం పడిన ప్రతిసారీ రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని , లింక్ రోడ్ పూర్తి చేస్తే ఎంతో మేలు చేకూరుతుందని రవికుమార్ యాదవ్ కి తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వర్షం పడిన ప్రతిసారీ పాపి రెడ్డి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నార్నే ఎస్టేట్స్ నుండి వచ్చే లింక్ ను త్వరితగతిన పూర్తి చేసినట్లైతే కాలనీ వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్, రమేష్, శ్రీనివాస్, రమణ, నర్సింగ్ యాదవ్, కోటి, సత్య కుమార్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్, విజయలక్ష్మి, సుశీల, లక్ష్మి పాల్గొన్నారు.