నమస్తే శేరిలింగంపల్లి: శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః. నాదోపాసనా రసామృతాన్ని సమస్త జీవరాశులు ఆనందిస్తాయన్నది ఆర్యోక్తి… ఈ సందేశాన్ని వివరించే ప్రత్యేక నాటికతో మదినాగూడ లోని Canary The School విద్యార్దులు ప్రపంచ సంగీత సంబరాన్ని ప్రారంభించారు. సంగీతాన్ని నిత్యం సాధన చేస్తే, విద్యార్ధులలో ఏకాగ్రత, మేధాశక్తి జ్ఞాపకశక్తి పెంపొందిస్తుందని వివరించారు.
మరికొందరు విద్యార్థులు అలపించిన గీతాలు, వివిధ సంగీత వాయిద్యాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అలాగే ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకొని పిల్లలు ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయురాలు Mrs. Lydia Christina యోగ వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలకు వివరించారు. ఉపాద్యాయులు, విద్యార్దులు ఉత్సాహంగా పాల్గొన్నారు.