శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని మాలవెన్ మస్తాన్ ఘాట్ శ్మశానవాటిక అలియాస్ కందివారి శ్మశానవాటికలో అక్రమంగా వెలసిన షెడ్డును తొలగించాలని కోరుతూ గంగారంకు చెందిన కంది పెంటయ్య అనే వ్యక్తి శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సదరు శ్మశానవాటిక కందివారికి చెందినదని, అందులో ఓ వర్గానికి చెందిన వారు రాత్రికి రాత్రే అక్రమంగా షెడ్డు నిర్మించారని అన్నారు. ఈ విషయంపై వారిని ప్రశ్నిస్తే తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కనుక వెంటనే సదరు అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించాలని చూసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.