- ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని అమ్మ వారి దేవాలయంలో జరిగిన ” తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం ” కన్నుల పండువగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ.. సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్ వైభవం సంతరించుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆలయ చైర్మన్ మలికార్జున శర్మ, బీఆర్ఎస్ పార్టీనాయకులు కృష్ణ యాదవ్, నటరాజు, గోవిందా చారీ, గోపి కృష్ణ, కవిత, నరేందర్ బల్లా, సందీప్, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.