ఆల్విన్ కాలనీ: ప్రజాసమస్యల పరిష్కానికే తొలి ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని కె.టి.ఆర్ నగర్ మ్యాన్ హోల్ పై మూత లేకపోవడంతో తీవ్ర ఇబందులకు గురవుతున్నామని స్థానిక ప్రజల విజ్ఞప్తిపై కార్పొరేటర్ స్పందించారు. ఈ విషయమై స్థానిక ఏ.ఈతో వాకబు చేయగా సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరించమని తెలిపారు. టి.ఆర్.ఎస్ పార్టీ యువజన నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ పర్యవేక్షణలో మ్యాన్ హోల్ మరమ్మత్తు పనులు పూర్తి చేశామమని కార్పొరేటర్ తెలిపారు. డివిజన్ లోని సమస్యలను తన దృష్టికి తీసుకురావలని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు.