శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): INTUC భవన నిర్మాణ కార్మిక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మియాపూర్ కు చెందిన గోలి శ్రీనివాసరావు నాయుడు నియమితులయ్యారు. ఆ శాఖ జాతీయ అధ్యక్షుడు RC కుంతియా చేతుల మీదుగా శ్రీనివాసరావు నాయుడు శుక్రవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని, వారికి దక్కవలసిన ప్రభుత్వ పథకాలు చేరవేస్తానని పేర్కొన్నారు.

తన పై నమ్మకం ఉంచి బాధ్యతలు సాధించినందుకు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ జాతీయ అధ్యక్షుడు RC కుంతియా, రాష్ట్ర అధ్యక్షుడు కొలుకూరి నరసింహారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మెరుగు రవి గౌడ్, తాండ్ర వెంకటేష్ గౌడ్, కొడాలి శ్రీధర్ సురభి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.





