శిల్పారామంలో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో మంగళవారం శిల్పారామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పైప్ బ్యాండ్, మహారాష్ట్ర బ్రాస్ బ్యాండ్ బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించాయి. అలాగే సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో మాధురి, చౌ నృత్యం, కరగాట్టం, వివిధ జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, సినీనటి ప్రేమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోలీస్ అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి విచ్చేసి కళాకారులు, బ్యాండ్ బృందాలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐజీ విక్రమ్ సింగ్, ఐపీఎస్ పాల్గొని కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించారు. పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలతో పాటు వివిధ ప్రాంతాల సంప్రదాయ కళారూపాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here