ఘ‌నంగా జెరిపాటి రామరాజు జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జేకే ఇన్‌ఫ్రా అధినేత జెరిపాటి రామరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని రామరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్వయంగా జెరిపాటి రామరాజు నివాసానికి చేరుకుని ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలకు శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ప్రజలు, నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై జెరిపాటి రామరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. జెరిపాటి రామరాజు జేకే ఇన్‌ఫ్రా సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరింత పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని ఆకాంక్షించారు. జెరిపాటి రామరాజు మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి, హాజరైన ప్రజలకు, నాయకులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆనందం, సంక్షేమమే తన ప్రధాన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారబోయిన రాజు యాదవ్, జెరిపాటి శ్రీనివాస్, అక్తర్, కాశీ వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here