శిల్ప ఎన్‌క్లేవ్‌లో వైభవంగా కోటి దీపోత్సవం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్ప ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తుల భాగస్వామ్యంతో కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగిందని, ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని పేర్కొన్నారు.

ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా ముక్తి కలుగుతుందని, సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారని గాంధీ తెలిపారు. అలాంటిది కోటి దీపోత్సవం వంటి పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్తీకమాసం రాగానే చన్నీటి స్నానాలు, దీపదానాలతో పాటు కోటి దీపోత్సవం గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. ఒక దీపం వెలిగిస్తే ఆ కాంతి మనలో సానుకూలతను నింపుతుందని, కోటి దీపాలు వెలిగించడం ద్వారా అజ్ఞానమనే చీకట్లు తొలగి జ్ఞానకాంతి ప్రసరిస్తుందని అన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే కోటి దీపోత్సవం కార్తీకమాసానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు రమణమూర్తి, నాయకులు కరుణాకర్ గౌడ్, చెన్నారెడ్డి, చంద్రశేఖర్, జయకుమార్, వరలక్ష్మి, నరేందర్ బల్ల, కాలనీ వాసులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here