మరో రకం సైబర్ మోసం…తస్మాత్ జాగ్రత్త

  1. ప్రజలకు పోలీసుల హెచ్చరిక

శేరిలింగంపల్లి: ఆన్లైన్లో ప్రతిరోజూ ఎదోఒక లావాదేవీలు చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతోపాటు సైబర్ మోసాలకు గురై పోలీసులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. చాలామంది వినియోగదారులకు ఆన్లైన్లో జరిగే మోసాల పట్ల అవగాహన ఉండటం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో సామాన్య ప్రజల ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు.

మొన్నీమధ్య ఓ వినియోగదారుడు olx సైటులో అమ్మకానికి ఉంచిన తన కెమెరా ని కొంటానంటూ ఓ ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి చేసే మోసాన్ని ముందుగా పసిగట్టి సోషల్ మద్యమలలో పోస్టు చేశాడు. అయితే సదరు నిందితుడు “నీవు తెలివైన వాడివి తప్పించుకున్నావు. మాకు ఇదే పని, దీనిని ఆపేది లేదు. రోజూ ఎంతో మంది అమాయకులకు వల వేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తాం. ప్రతీ నెలా 4 నుండి 5 లక్షలు సంపాదిస్తాం, ఎం చేసుకుంటావో చేస్కో” అంటూ సవాల్ వేసిరాడు.

  1. ఈ ఒక్క ఉదంతం చాలు ఆన్లైన్ లో ప్రతిరోజు ఎంతమంది ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నారో చెప్పడానికి. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలంటూ   పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. దాదాపు మన మొబైల్ నెంబర్ తో పోలి ఉన్న నెంబర్ తోనే లేదా ఏదో ఒక నెంబర్ నుండి మనకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ సారాంశం ఏమంటే..

అయ్యా.. నేను ఉద్యోగం/ లేదా ఎదో రిజిస్ట్రేషన్ నిమిత్తం నా నెంబర్ కి బదులు పొరపాటున మీ నెంబర్ ఇచ్చేశాను..ఇప్పుడు మీ మొబైల్ కి నా మొబైల్ కి రావాల్సిన OTP వస్తుంది. కాస్తా ఆ ఓటిపి(వన్ టైం పాస్వర్డ్) నాకు చెప్పండి ప్లీజ్ అలా ఐతే నాకు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అంటూ ఎంతో రిక్వెస్ట్ మానర్ లో ఆ కాల్ ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళకు ఆ OTP చెప్పామా మన అకౌంట్ లో డబ్బు గోవిందా..!

సదరు సైబర్ నేరగాడు ఆ OTP ని ఉపయోగించి మన ఆన్లైన్ బ్యాంకింగ్ ని వాడి అధీనంలోకి తెచ్చుకుంటాడు. కాబట్టి మన ఫోన్ కు ఎలాంటి OTP లు వచ్చినా కూడా అవి ఇతరులతో పంచుకోకూడదని, నమ్మకమైన సంస్థలలో తప్ప ఇతర సంస్థల వెబ్సైట్ లలో ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మనకు సంబందించిన బ్యాంకు/UPI అప్లికేషన్లు/క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, గుర్తు తెలియని website లింకులను తెరవవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here