మక్త మహబూబ్‌పేట్ పెద్ద కుడి చెరువు పునరుద్ధరణ పనుల పరిశీలన

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేట్ గ్రామంలోని పెద్ద కుడి చెరువు సుందరీకరణ, పునరుద్ధరణ పనులను మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. స్వచ్ఛందంగా చేపట్టిన చెరువు పునర్జీవన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనుల పురోగతిని ఇరిగేషన్ అధికారులతోపాటు మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. చెరువు అభివృద్ధి, సుందరీకరణ, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడంపై ఇరిగేషన్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చెరువులు ప్రాంతానికి ఎంతో విలువైన సహజ వనరులని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు భాగస్వాములై చెరువుల పునర్జీవనానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో పెద్ద కుడి చెరువును సుందరమైన, ఆహ్లాదకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. చెరువు సమీపంలో డ్రైనేజీ మళ్లింపు పనులు చేపట్టడంతో పాటు మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ DE ఉదయ్ భాస్కర్, AE లింగ స్వామి, మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యుడు చైతన్య, స్థానిక నాయకులు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here