కొండాపూర్: కొండాపూర్ డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, హనీఫ్ కాలనీలలో విద్యుత్ లైన్ల క్రమబద్ధీకరణ పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హామీద్ పటేల్ మాట్లాడుతూ కాలనీలలోగల పాత విద్యుత్ స్తంభాలు, తీగల కారణంగా తరచూ స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్న విషయాన్ని గచ్చిబౌలి డీఈ నర్సింహారెడ్డికి వివరించడం జరిగింది తెలిపారు. సమస్య పై వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి పునరుద్ధరణ పనులను చెప్పడడం జరిగిందన్నారు. విద్యుత్ లైన్ల పునరుద్దరణ, పాత విద్యుత్ స్తంభాలను మార్చటం, 3 ఫెజ్ లైన్లను పొడిగించటం వంటి పలు సమస్యలు పరిష్కరించబడ్డాయని తెలిపారు. సమస్య పరిష్కరించడంలో కృషి చేసిన అధికారులకు కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో కాలనీ వైస్ ప్రెసిడెంట్ గఫుర్, ఏరియా కమిటీ మెంబర్ తాడెం మహేందర్, రహీం బాబా, సమద్, లక్ష్మి, వనిత రాణి, యూత్ నాయకులు నసీరుద్దీన్, సాగర్, హేమ సుందర్ మరియు కాలనీ వాసులు ఉన్నారు.