శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బేరి రామచందర్ యాదవ్ ఆయనకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల మధ్య ఉంటూ వారి మన్ననలు పొందుతున్న నవీన్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి కల్పించాలని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు తెలుగు ఐలేష్ యాదవ్, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అందెల కుమార్ యాదవ్‌తో పాటు పలువురు యాదవ సంఘం, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.





