నమస్తే శేరిలింగంపల్లి: సీపీఎం శేరిలింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో చందానగర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కామ్రేడ్ మహబూబ్ పాషా, నరహరి 33వ వర్ధంతి నిర్వహించారు. సమావేశంలో సిపిఎం పార్టీ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి శోభన్ మాట్లాడుతూ.. కామ్రేడ్ మహబూబ్ పాషా, నరహరి పేద ప్రజల అభ్యున్నతి కోసం తమ ప్రాణాలు అర్పించిన గొప్ప త్యాగమూర్తులని అన్నారు. పేదల తరఫున నిక్కచ్చిగా పోరాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారని , పేద రైతులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల తరపున న్యాయంగా పోరాటం చేశారన్నారు. కానీ ఓర్వలేని కొంతమంది దుర్మార్గ భూస్వాములు కలిసి 1989లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వారిని హతమార్చారని తెలిపారు. కామ్రేడ్ మహబూబ్ పాషా, నరహరిని చంపారు కానీ.. వారి ఆశయాన్ని, సిద్ధాంతాన్ని చంపలేరన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కృష్ణ, రవి, వాబన్న, ప్రవీణ్, మూర్తి, హకీమ్ పాల్గొన్నారు.