- జోగిగూడెం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ హమీద్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దిశానిర్ధేశంతో, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో.. మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలోని జోగిగూడెం గ్రామంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ కి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ సందర్బంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో తెరాస పార్టీ ఘన విజయం సాధించటం ఖాయమని అన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే టిఆర్ యస్ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. గ్రామ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, తెరాస పార్టీ నాయకులు తిరుపతి యాదవ్, పి. రామకృష్ణ, కృపాకర్, సిద్దయ్య, సిద్దులు, శైలేష్, యాదయ్య పాల్గొన్నారు.