నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్బంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సంస్థాన్ నారాయణపురం మండలంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నియంతృత్వ పాలనను అంతం చేయాలంటే , మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్ , బీజేపి మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆళ్ళ వర ప్రసాద్ , బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు నక్కా నరేందర్ గౌడ్ , శాంతిబూషన్ రెడ్డి , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.