నడిగడ్డ తండాలో ఘనంగా డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

నమస్తే‌ శేరిలింగంపల్లి: జాతీయవాదాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని, భారతీయ జన సంఘ్ పార్టీని స్థాపించడంతో పాటు హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిగా ముఖర్జీ విశిష్ట సేవలందించారని బీజేపీ‌ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డీఎస్ ఆర్ కె ప్రసాద్ అన్నారు. ప్రముఖ జాతీయ వాద నేతలలో ముఖ్యుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 120వ జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మియాపూర్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. నడిగడ్డ తాండ లోని హనుమాన్ టెంపుల్ వద్ద బీజేపీ డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవినాయక్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా ఉపాధ్యక్షుడు డి ఎస్ ఆర్ కె ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు‌ మాణిక్ రావు మొక్కలు నాటి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్ మనోహర్ గారు, కళ్యాణ్, ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ, రత్న కుమార్, విజేందర్, ఆంజనేయులు సందీప్ పాల్గొన్నారు.

శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మియాపూర్ లో మొక్కలు నాటుతున్న‌ బీజేపీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here