శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అలరించాయి. కాలిఫోర్నియా నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి తాస్య ముద్దన తన ప్రదర్శనలో పుష్పాంజలి, గణేష్ వందన, రామ కౌత్వం, దేవర్ణమా, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ప్రముఖ కూచిపూడి నాట్య గురువు నిర్మల్ విశ్వేశ్వర్ రావు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహన, పుష్పాంజలి, పలుకే బంగారమాయెనా, అదిగో అల్లదిగో, ఇదిగో భద్రరి, పంచాక్షరీ, గీతం, కౌతం, వేడుకొందామా, చక్కని తల్లికి, తరంగం అంశాలను నీహారిక, గాయత్రీ, అక్షిత, మనోజ్ఞ, హాసిని, ఇషిక, సహస్ర, నిత్య మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.