హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నూతన కార్యవర్గం ఎంపిక‌

శేరిలింగంప‌ల్లి, జూన్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లో భారతీయ జనతా పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రాజమాత అహల్యా బాయి హోల్కర్ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్ర‌క‌టించారు. రానున్న రోజుల్లో నిర్వహించవలసిన ఇతర కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నూతన కార్యవర్గంలో నియమితులైన నాయకులకు నియామక పత్రాలు అంద‌జేశారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులుగా యమ్.వెంకటేశ్వర్లు , టీ.శివాజీ , టీ.ప్రసాద్ పాత్రో , శివ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులుగా ఎన్. జగదీశ్వర్ గౌడ్ , వీ. రాజు ముదిరాజ్ , కార్యదర్శులుగా పీ. గిరీష్మా , వై. రాజు యాదవ్ , సాయి కళా , యమ్. వి. సుబ్బారావు , కోశాధికారిగా ఏ.సుభాష్ , కార్యవర్గ సభ్యులుగా విజయ్ కుమార్ , రామారావు , సుబ్బారెడ్డి , సాయి హర్షిత , నాగరాణి , రామ్ రెడ్డి , రాజు గౌడ్ , ప్రభాకర్ రెడ్డి , అశుత కులకర్ణి , అశోక్ ముదిరాజ్ , నరసింహ చారి , మునికొండ రాజకుమార్ , నరేష్ ల‌కి నియామక పత్రాల‌ను అంద‌జేశారు.

అనంతరం హఫీజ్ పేట్ డివిజన్ లో ఎక్కువ సంఖ్యలో బీజేపీ సభ్యత్వం చేసిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అజిత్ సేనాపతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ కే.రాఘవేంద్ర రావు , శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కో – కన్వీనర్ మల్లాపురం మణిభూషణ్ , హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి ప్రభారీ స్వామి గౌడ్ , బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు వినయ , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , బీజేపీ మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆళ్ల వరప్రసాద్ , బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు , బీజేపీ డివిజన్ నాయకులు పాలం శ్రీనివాస్ , అశోక్ .జి , కృష్ణంరాజు , మనోజ్ యాదవ్ , నవీన్ కుమార్ , మహేష్ గౌడ్ , సంజు గౌడ్ , కన్న యాదవ్ , పోలింగ్ బూత్ అధ్యక్షులు , శక్తికేంద్రం ఇంచార్జ్ లు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here