శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కల్యాణం విశిష్టత తెలియచేస్తూ ఒగ్గలో, పోతురాజుల విన్యాసాల నడుమ భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు.
టీపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నర్సింహ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, బొంతు శ్రీదేవి, పుష్ప నగేష్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు కాల్వ సుజాత, జేరిపేటి జైపాల్ , మెట్టు సాయి కుమార్, టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గా రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రచార కమిటి చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కీ, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.