సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం: గచ్చిబౌలి‌ డివిజన్ కార్పొరేటర్ వి.‌గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంగళవారం ఆరో రోజున నిర్వహించగా స్థానిక కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి ద్వారా కాలనీలను,‌ బస్తీలను‌ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్లపై ఏర్పడిన‌ గుంతలను పూడ్చడం, రోడ్లకిరువైపులా ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించడం జరుగుతుందని‌ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి అన్నారు. అనంతరం స్థానికులు, బీజేపీ నాయకులతో కలిసి మొక్కలను నాటారు. మొక్కలు‌ మానవ మనుగడకు తోడ్పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ జలెందర్ రెడ్డి, బీజేపీ‌ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ గారు, జిల్లా నాయకులు స్వామి గౌడ్, సంతోష్ సింగ్, అశోక్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు నక్క శివ కుమార్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, శివ సింగ్ , సంతోష్ సింగ్ , దేవేందర్ రెడ్డి , బబ్లూ సింగ్ , ధనరాజ్ సింగ్, చిట్టి మ‌హెంద‌ర్ గౌడ్‌, శ్రీకాంత్ రెడ్డి , దేవేందర్ రెడ్డి, కొండ గోపాల్ ,ఆర్ వెంకటేష్, మహేశ్వరి, రాఘవ రావు , దయాకర్ ,శంకర్ యాదవ్ ,కిషన్ సింగ్ , తిరుపతి ,గుండప్పా, రాజు గారు, రాఘవేంద్ర , జీహెచ్ఎంసీ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నానక్ రాం గూడలో మొక్కలు నాటుతున్న గచ్చిబౌలి‌ కార్పొరేటర్ వి.‌గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here