శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భోగ్ బండారో కార్యక్రమం, బంజారా వేద పాఠశాల ను బంజారా నాయకులు, మాజీ మంత్రి రవీందర్ నాయక్ చేతుల మీదుగా బంజారా వేద పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఈ తరం బంజారా పిల్లలు, యువకులు బంజారాల సంస్కృతి సాంప్రదాయం, సేవాలాల్ మహారాజ్ బంజారాల జాగృతి కోసం చేసిన పోరాట ప్రతిమలను తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రతి బంజారా పౌరుడు సేవాలాల్ మహారాజ్ సైనికులుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బంజారా గాయకులు బంజారా ప్రవచనకర్త ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న డాక్టర్ sp నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, రెడ్యానాయక్, శంకర్ నాయక్, హనుమంతు నాయక్, లక్ష్మణ్ నాయక్, మహేష్ యాదవ్, లకపతి నాయక్, గోపి నాయక్, జితేందర్ నాయక్, రాఘవేంద్ర, రవి, శంకర్, మురళి నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.