నమస్తే శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ని మీటింగ్ హాల్ లో వినాయక చవితిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జోన్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు, మహిళకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే నివాసం, ఆయా డివిజన్ల కార్పొరేటర్ కార్యాలయాలలో విరివిగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి కాలనీకి, వెల్ఫేర్ అసోసియేషన్లకు మట్టి వినాయకులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించి చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితం కాకుండా ఉంటుందన్నారు. వీలైనంత వరుకు మట్టి వినాయకులను వారివారి స్వగృహా పరిసర ప్రాంతాల్లోనే నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ నగేష్ నాయక్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు జంగం గౌడ్, చింతకింది రవీందర్, కొండల్ రెడ్డి, పద్మారావు, కృష్ణ యాదవ్, రాంచందర్ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, నటరాజు, నరేందర్ బల్లా, సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, అరుణ కుమారి, రూపరెడ్డి, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ లో…
మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం అని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ గారు అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీ, శిల్పా ఎన్ క్లేవ్ కాలనీలలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహలను స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.