శేరిలింగంపల్లి, జూన్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా PJR ఫ్లై ఓవర్ ను జూన్ 28వ తేదీన శనివారం ప్రారంభించనున్నామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ స్టేజ్ 2 కొండాపూర్ వైపు రూ. 446.13 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 6 లేన్ బై డైరెక్షనల్ PJR ఫ్లై ఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను GHMC కమిషనర్ RV కర్ణన్, జోనల్ కమిషనర్ హేమంత్ బొర్ఖడే, డీసీ ప్రశాంతి, CE ప్రాజెక్ట్స్ భాస్కర్ రెడ్డి, ప్రాజెక్ట్స్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ ఫ్లై ఓవర్ కి PJR పెట్టడం గొప్ప విషయం అని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని అన్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు సాంత్వన చేకూరుతుందని, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ అధికారులు SE శ్రీ లక్ష్మీ, EE సౌమ్య, DE హరీష్ బాబు, AE శివ కృష్ణ, GHMC SE శంకర్ నాయక్, DE ఆనంద్, నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.