శేరిలింగంపల్లి, జూన్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆదర్శనగర్, ప్రశాంతినగర్, బాపునగర్ లలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. సీసీ రోడ్డు పనులను పరిశీలించడంతోపాటు స్థానికంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ లో డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించమని, బస్తీలలో డ్రైనేజీ సమస్య ఉన్న చోట ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలని, ఆ తర్వాతే సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బస్తీ వాసులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సీసి రోడ్డు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, అడ్వకేట్ శ్రీనివాస్, నర్సింహారెడ్డి, రమేష్, అశోక్, పవన్, దుర్గా మాత టెంపుల్ కమిటీ మెంబర్స్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.