సమస్యలపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు గచ్చిబౌలి వాసుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి రోడ్ నెంబర్ 2, 3 లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బస్తీ కమిటీ సభ్యులు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గచ్చిబౌలి కాలనీలో పాత డ్రైనేజీ లైన్ అస్తవ్యస్తంగా ఉండడంతో మురికి నీరు రోడ్డుపైకి వచ్చి ఇబ్బందికరంగా మారిందన్నారు. నూతన భూగర్భ డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు చేయాలని, స్ట్రీట్ లైట్స్ కోసం 20 నూతన స్తంబాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందిరానగర్, గచ్చిబౌలి ఏరియాలో గల ముస్లిం స్మశాన వాటికకు ప్రహరీ గోడను నిర్మించేలా చూడాలన్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి బస్తీ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నహీమ్, అబ్దుల్ రహీం, అఫ్జల్, టింక్, సదానంద్, మల్లికార్జున్, లక్ష్మణ్, గోపాల్ యాదవ్, సుభాష్ రాథోడ్, నాగారావు తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి ‌కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు వినతి పత్రం అందజేస్తున్న గచ్చిబౌలి బస్తీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here