శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని, గోపనపల్లి గ్రామంలోని మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్ నివాసానికి విచ్చేసిన మహిళలను భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి కంటేస్టెడ్, అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివాసింగ్, రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు వరలక్ష్మి, ఉదయ లక్ష్మి, రమ, శశి, రజనీ, మహతి, హేమ, అషవారి, శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.