శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువులో జిహెచ్ఎంసి ఎంటమాలజీ అధికారులతో కలసి డ్రోన్ యంత్రం సహాయంతో దోమల నివారణ కొరకై యాంటీ లారా మందును కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిచికారీ చేయించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ… దోమల బెడద నివారణ కొరకై పటేల్ చెరువు చుట్టూ పరిసర ప్రాంతాల కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి, ఎంటమాలజీ సిబ్బంది తో డ్రోన్ యంత్రం సహాయం తో దోమల మందు పిచికారీ చేయించడం జరిగిందని అన్నారు. మన ఇంటి తో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని, పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి దోమల బెడద ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఏ ఈ రామవత్ చిన్న , రహీమ్, దశరథ్,రాజేష్, మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ, చంద్రకళ, చందు, కురువ శ్రీనివాస్ యాదవ్ తదిరులు పాల్గొన్నారు.