శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో ఉన్న MLN గార్డెన్స్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో ఎంబిసి అభివృద్ధి సంస్థ చైర్మన్ జేరిపేటి జైపాల్, కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్, వియాట్రిస్ భారత సి.ఎస్. ఆర్, పరిపాలన సేవల అధిపతి మిషెల్ డొమినిక లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలను సన్మానించి, కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిత్యం రోడ్లను శుభ్రం చేస్తూ పారిశుధ్య పనులు చేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి వారి కాళ్ళు కడిగి వారిని గౌరవించారు. పారిశుధ్య కార్మికులు డాక్టర్లు, ఉపాధ్యాయులు, పొదుపు సంఘాల సభ్యులు మొదలగు రంగాలలో సేవలందిస్తున్న మహిళలను గౌరవిస్తూ సన్మానించి, మహిళలందరికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. మహిళలందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.