శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి శనివారం సాయంత్రం అన్నమ స్వరార్చనలో భాగంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య సంగీత కళా నిలయం సంస్థ నుండి కే. సాయి శరణ్య, శిష్య బృందం, కే. సాయి శ్రావ్య, కే. జ్యోషిత, టి. భువశ్రీ, సి. మొన్వి, యమ్. ధృతి, భువన సంయుక్తంగా శ్రీ గణనాథం భజారే, అలమేలుమంగ, గోవింద గోవింద, చక్కని తల్లికి – గ్రూప్, నారాయణతే నమో నమో, శ్రీమన్నారాయణ, వేదంబెవ్వని వెదకెదిరి, షోడశ కళానిధికి, తిరు తిరు జవరాల – గ్రూప్, తందనానాహి , కట్టెదురా వైకుంఠము , ముద్దుగారే యశోద – గ్రూప్ , వేడుకొందామ – గ్రూప్, ఘనరవములు ఘలుపుల్లన, చూడరమ్మ సతులాల, మాధవ కేశవ మొదలైన బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమాచార్య సంకీర్తనలను సభక్తిపూర్వంగా అందించారు. అనంతరం కళాకారులకు, అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికను అందించారు.