శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి మండలంలోని జంట సర్కిళ్ళ పరిధిలో ఉన్న 40 కాలనీలలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలైన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. తారానగర్ లో ఉన్న విద్యానికేతన్ మోడల్ హైస్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, MVR గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోని ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి, MVR groups చైర్మన్ మూల వేంకటేష్ గౌడ్ విచ్చేశారు.
ఈ సందర్భంగా జంట సర్కిళ్ళ పరిధిలోని మహిళా నాయకురాళ్ళకు 85 మందికి ఉత్తమ మహిళా పురస్కారాలతో సాంప్రదాయ బద్దంగా, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి విజయజ్యోతి, మేకల విజయలక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, అమ్మయ్య చౌదరి, జనార్ధన్, విజయలక్ష్మి, సుశీల, G.V. రావు, శివరామకృష్ణ, బాలన్న తదితరులు పాల్గొన్నారు.