శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని వెంకటేశ్వరనగర్ పీజేఆర్ కమ్యూనిటీ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు నాగమణి పర్యవేక్షణలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమనికి ముఖ్యఅతిధులుగా తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చేర్మెన్ జెరిపేటి జైపాల్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.
ఈకార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషిపాక యాదగిరి, నియోజకవర్గం సీనియర్ నాయకులు ఏకాంత్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి యాదగిరి, సీనియర్ నాయకులు గణేష్ గౌడ్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పల్నాటి అశోక్, ప్రధాన కార్యదర్శి జీతేందర్, సెక్రటరీ సంధ్య, రంగారెడ్డి జిల్లా యూవజన కాంగ్రెస్ సెక్రటరీ ఉప్పల శృతి శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు సంపగి యాదగిరి, మర్లశ్రీను, మునిశ్వర్ రావు, పోతురాజు, భూషణం, నరహరి గౌడ్, వనజ, స్వప్న, మంజుల, యూవజన కాంగ్రెస్ నాయకులు వినోద్, హరీష్, నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు షాలిని, రాధాబాయి,పద్మ, కవిత, విశాల గణేష్ గౌడ్, సుమతి దయాకర్ రెడ్డి, డివిజన్ లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,