శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నేతాజీ నగర్ కాలనీ లో కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ కాలనీలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సృష్టి పుట్టుకకు మూలం స్త్రీ అదే స్త్రీని అగౌరపరిస్తే సృష్టి వినాశనానికి కూడా కారణం అవుతుందన్నారు. ఆడదే కదా అని ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే సృష్టిలోనే అతి భయంకరమైన రూపం లో ఆదిపరాశక్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయుడు, కే నరసింహ యాదవ్, అంజిరెడ్డి, సత్తెమ్మ, గంగమ్మ, జయ రెడ్డి, రాధా రాణి రెడ్డి, చిట్టెమ్మ లాల్ రెడ్డి, జయమ్మ, రమాదేవి, విష్ణు ప్రియ, సరోజినమ్మ, అంజలీదేవి, కృష్ణవేణి, సుగుణమ్మ, శారద, సావిత్రి, జమున, కృష్ణకుమారి, కావేరి, రమణమ్మ పాల్గొన్నారు.