నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పి. సూర్యకిరణ్ నియామకం అయ్యారు. తెలంగాణ అంబేద్కర్ గ్రేటర్ హైదరాబాద్ సమావేశాన్ని మియాపూర్ లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పోతరాజు లాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఏర్పుల శ్రీహరి హాజరై కమిటీలు వేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న విజయ్ ని శేరిలింగంపల్లి అధ్యక్షునిగా నియమించగా ప్రధాన కార్యదర్శిగా పి. సూర్య కిరణ్ ని నియమించారు. ఈ సందర్భంగా సూర్య కిరణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల పై ఎప్పటికప్పుడు స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
