శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): రాందేవ్ ఆసుపత్రి లో కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు, వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సమాజ హితం కోసం పనిచేస్తారని అన్నారు. అటువంటి వారు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాందేవ్ ఆసుపత్రి చైర్మన్ కమలాకర్, సీఈ ఓ యోబు, జర్నలిస్టులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.