శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీనగర్ కాలనీ లో జరిగిన మాతృశ్రీనగర్ కాలనీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్-8 ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మాతృశ్రీనగర్ కాలనీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్-8 నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అని అన్నారు. క్రీడలు పిల్లలలో దాగిన సృజనాత్మకత ను బయటకి వెలుగు దీయడానికి ఎంతగానో దోహదపడతాయని, పిల్లలకు చదువుతోపాటు క్రీడలు ఎంతగానో ముఖ్యం అని అన్నారు. క్రీడలతో శారీరక శ్రమతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు.
అంతకు మందు గాంధీ టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రోఫీని ప్రదర్శించారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడిన గాంధీ ప్లేయర్లను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.