శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణ వేణి టాలెంట్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావుతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని పాఠశాలలో విద్యార్థులు రూపొందించిన పలు నమూనాలను పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజ్ఞానశాస్త్ర ప్రాజెక్ట్ ఫలితాలను నివేదిక, ప్రదర్శన బోర్డు, నమూనాల రూపంలో ప్రదర్శించే ఒక పోటీతత్వాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు.
ఇలాంటి ప్రదర్శన విద్యార్థులు సంవత్సరమంతా చేసిన పనిని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదికగా నిలుస్తుందని, ఇది విద్యార్థులలో ప్రేరణ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని తెలుసుకునే పరిపుష్టిగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందీప్ ముదిరాజ్, శివ, రెహ్మాన్, సౌందర్య రాజన్, పాఠశాల అధ్యాపకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.