శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం H. C. University OBC స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపుమేరకు సావిత్రిబాయి పూలే డి.ఎస్.టి ఆడిటోరియం సమావేశంలో సూరజ్ మండల్ తో పాటు తీన్మార్ మల్లన్న, జె ఏ సి చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్, ఆర్ కే సాయన్న ముదిరాజ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఓబీసీ స్టూడెంట్స్ జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఓబిసి ఉద్యమం గురించి జరుగుతున్న అన్యాయాల గురించి కొంత వివరించిన తర్వాత మనమందరం సూరజ్ మండల్ ఉద్యమంలో పాల్గొందామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మా జీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఉద్యమకారుడు లక్ష్మణ్ యాదవ్, , ప్రవీణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, విద్యార్థులు పాల్గొన్నారు.